News March 20, 2025

ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మార్చి 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సీటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. 

Similar News

News December 14, 2025

WNP: సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలపండి: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి అలసత్వం లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 14, 2025

నెల్లూరులో ఫ్రెండ్‌నే మోసం చేశాడు..!

image

ఫ్రెండ్‌నే మోసం చేసిన ఘటన ఇది. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన షేక్ అమీర్ అహ్మద్, కోటమిట్టకు చెందిన ఎండీ అర్షద్ అహ్మద్ స్నేహితులు. బంగారం వ్యాపారం చేసే అర్షద్.. ఈ బిజినెస్‌లో పెట్టుబడితే బాగా లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో అర్షద్‌కు అమీర్ రూ.3.55 కోట్లు ఇచ్చాడు. లాభాలు చూపకపోగా నెల్లూరు నుంచి అర్షద్ అదృశ్యమయ్యాడు. మోసపోయానని గ్రహించిన అమీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News December 14, 2025

విశాఖ: ముగిసిన WHIF-2025

image

3 రోజుల వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (WHIF)-2025 విశాఖలోని మేడి టెక్ జోన్‌లో శనివారం ముగిసింది. వైద్య సాంకేతిక రంగంలో గ్లోబల్ సహకారం, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఫోరం పిలుపునిచ్చింది. ఫోరంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఎక్స్‌పో,మెడ్‌టెక్ సిల్క్ రోడ్,స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్,ఆరోగ్య రంగంలో మీడియా పాత్రపై చర్చించారు. 6వేల మందికి పైగా ప్రతినిధులు, 200కిపైగా ప్రసంగకర్తలు,100కిపైగా ఎగ్జిబిటర్లు వచ్చారు.