News March 21, 2024
ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.
Similar News
News April 4, 2025
జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత రానీయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు.
News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
News April 3, 2025
నాగాయలంక: రూ.13.50లక్షల నిధులు దుర్వినియోగం

నాగాయలంక పీఏసీఎస్‌లో రూ.13.50 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు తన తనిఖీలో గుర్తించామని మచిలీపట్నం కేడీసీసీ బ్యాంక్ విచారణాధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. గురువారం నాగాయలంక కేడీసీసీ బ్యాంకులో ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను ఆడిట్ అధికారిగా వచ్చి నాగాయలంక పీఎసీఎస్‌లో పలు రికార్డులను తనిఖీ చేయగా, ఎరువుల స్టాక్‌లో వ్యత్యాసాలు, మొత్తాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.