News March 28, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు. 

Similar News

News April 2, 2025

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

image

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు. 

News April 2, 2025

ఖమ్మం: సహకార పురోగతి ప్రగ్యా పథకంపై ప్రశ్నించిన ఎంపీ

image

సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలు తెలపాలని.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. మంగళవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఆ పథకానికి సంబంధించిన వివరాలు చెప్పాలన్నారు. దీనికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

News April 2, 2025

నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

image

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయిస్తున్నట్లు అధికారపక్షం తెలపగా, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభా సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్, TMC, SP, MIM, DMK వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

error: Content is protected !!