News April 15, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

image

వేసవి రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- కర్నూలు సిటీ(KRNT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08545 VSKP- KRNT రైలును ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు ప్రతి మంగళవారం, నం.08546 KRNT- VSKP మధ్య నడిచే రైలును ఏప్రిల్ 16 నుంచి మే 28 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News December 14, 2025

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

image

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 14, 2025

ఏపీలో ₹లక్ష కోట్లతో ‘సాగర్‌మాల’ ప్రాజెక్టులు

image

AP: ‘సాగర్‌మాల’ కింద APలో ₹లక్ష కోట్లతో 110 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక వృద్ధికి వీలుగా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో పేర్కొంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆధునీకరణ, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంపు, కోస్టల్ కమ్యూనిటీ, షిప్పింగ్, జలమార్గాల అభివృద్ధి వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో తీరప్రాంతం లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని పేర్కొంది.

News December 14, 2025

దంతాలపల్లి సర్పంచ్‌గా బాలాజీ

image

దంతాలపల్లి మండల కేంద్ర సర్పంచ్‌గా యువ నాయకుడు పొన్నోటి బాలాజీ గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన వీరబోయిన కిషోర్‌పై 114 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తమ నాయకుడు గెలుపొందడంతో దంతాలపల్లి ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. ఈ విజయానికి బాలాజీ సంపూర్ణ అర్హుడని స్థానికులు కొనియాడారు.