News February 7, 2025

ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: ASF కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పట్టబద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News February 7, 2025

స్థానిక ఎన్నికలు: సంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన సంగారెడ్డి జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC-27, MPP-27,MPTC-276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276కు తగ్గించారు. జడ్పీటీసీలు 25 నుంచి 27కు పెరిగాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

News February 7, 2025

సర్పంచ్ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు

image

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీ‌లు 5, గ్రామ పంచాయతీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC-230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.

News February 7, 2025

సర్పంచ్ ఎన్నికలు: మెదక్ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీ‌లు, 21 మండలాలు ఉన్నాయి. మసాయిపేట కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-21, ఎంపీపీ-21, ఎంపీటీసీ-190, గ్రామ పంచాయతీలు 492 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

error: Content is protected !!