News February 26, 2025
ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన WGL కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ సత్య శారద సందర్శించారు. 6 రూట్స్ ద్వారా 13 కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని పంపనున్నారు. పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రతిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Similar News
News February 27, 2025
చిన్న మెట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లి గ్రామానికి చెందిన మోత్కూరు సంజయ్ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ చదువులో వెనక పడటంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2025
ఏడుపాయలలో తెలంగాణ జానపదుల సమ్మేళనం

ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.
News February 27, 2025
వర్గల్: వివాహేతర సంబంధంతో మహిళ హత్య

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(40)తో అదే గ్రామానికి చెందిన బండ్ల చిన్న లక్ష్మయ్య మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 15న గజ్వేల్ పరిధిలోని కోమటిబండ అటవీ ప్రాంతంలోకి మహిళను తీసుకెళ్లి పురుగు మందు కలిపిన కల్లు తాగించాడు. ఆ తరువాత మెడకు చీరతో ఉరేసి చంపినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.