News April 12, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళి మరవొద్దు: డీఎస్పీ

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో సోమరాజుపేట గ్రామంలో ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్, బైండోవర్ షరతుల గురించి వివరించారు. ఎన్నికల సమయంలో తగాదాలు పడవద్దని, పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Similar News

News September 29, 2024

శ్రీకాకుళం: హోంమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్

image

భారత విమానయాన రంగ పురోగతిపై సమీక్షించడంతో పాటు పలు అంశాలపై చర్చిండానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ఢీల్లిలో సమావేశం అయ్యారు. ఈ మెరకు శ్రీకాకుళం నగరంలోని కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయము నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. భారత విమానయాన రంగ పురోగతిపై పూర్తిస్థాయిలో సహకరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.

News September 29, 2024

సండే స్పెషల్: సిక్కోలు కళారూపం ‘తప్పెటగుళ్లు’

image

శ్రీకాకుళం జిల్లా యాదవులు కళారూపంగా “తప్పెటగుళ్లకు” ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తప్పెటగుళ్ల సంప్రదాయ నాగరికతను పూర్వీకులు నుంచి కొనసాగిస్తున్నారు. యాదవ కుటుంబాలకు పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం జీవనాధారం. పశుగ్రాసం కష్టతరమైన సమయంలో దైవానుగ్రహం కోసం తప్పెటగుళ్లతో పూజలు చేస్తారు. ఇక పండగలు, గావు సంబరాల్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది.

News September 29, 2024

షూటింగ్ పోటీల్లో టెక్కలి విద్యార్థిని ప్రతిభ

image

సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్జ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్ లో 400 షూట్లకు గాను 391 పాయింట్లు సాధించింది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.