News March 31, 2024
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించాలి: రోనాల్డ్ రోస్

ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బంజారాభవన్‌లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
Similar News
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 20, 2025
HYD: క్రికెట్ బెట్టింగ్ భూతానికి యువకుడి బలి

క్రికెట్ బెట్టింగ్ కారణంగా మియాపూర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మియాపూర్ PS పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేశ్(26) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకొవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.