News February 13, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News February 14, 2025

గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి

image

భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News February 14, 2025

HEADLINES TODAY

image

AP: 2027 జూన్‌కల్లా పోలవరం పూర్తికావాలి: సీఎం చంద్రబాబు
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
TG: విభజన తర్వాత తెలంగాణ అప్పుల్లోకి: నిర్మల
TG: వైద్య సేవల్లో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
TG: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ కేంద్రాలు
అమెరికా చేరుకున్న మోదీ, మస్క్‌తో భేటీ
పార్లమెంటులోకి ఆదాయ పన్ను కొత్త బిల్లు
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

News February 14, 2025

మెదక్: నేటికి 11 ఏళ్లు..

image

సరిగ్గా ఇవాళ్టికి 11 ఏళ్లు. దేనికి అనుకుంటున్నారా..? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి. 2014, ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ ఎంపీ హోదాలో ఆయన పోరాటం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

error: Content is protected !!