News February 8, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

image

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరిటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేష్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 9, 2025

జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.

News February 9, 2025

SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

image

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

News February 9, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!