News February 2, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్

image

WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.

Similar News

News February 2, 2025

కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం

image

మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 2, 2025

తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్

image

*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్‌టైన్‌మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.

News February 2, 2025

బెల్లంపల్లి: 3 రోజులుగా ఆ పరిసరాల్లోనే పెద్దపులి

image

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు బుగ్గగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో గత 3రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పులి జాడ తెలుసుకునేందుకు 5చోట్ల కెమెరాలు అమర్చినట్లు అధికారి వివరించారు. కానీ కెమెరాల్లో పెద్దపులి చిక్కలేదని వివరించారు. కాగా ఆదివారం ఉదయం పులి తిరుగుతున్న పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.