News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News December 14, 2025
నంద్యాలలో 2,452 కేసుల పరిష్కారం

నంద్యాల లోక్ అదాలత్‌లో 2,452 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి అమ్మనరాజా తెలిపారు. సీసీ కేసులు 79, ఎస్టీసీ కేసులు 1952, డీవీసీ 1, మెయింటెనెన్స్ 3, ఎక్సైజ్ 57, అడ్మిషన్స్ 32, ఓఎస్ 87, క్రిమినల్ 2, ఎంవీ ఓపీ 30 కేసులు పరిష్కరించామని వివరించారు. ఎక్సైజ్, అడ్మిషన్స్, ఎస్టీసీ కేసుల ద్వారా రూ.20,47,969 ప్రభుత్వానికి ఆదాయం లభించిందన్నారు. మోటారు వెహికల్ ప్రమాదంలో లబ్ధిదారులకు రూ.6.24 కోట్లు అందజేశారు.
News December 14, 2025
రేపు అనకాపల్లి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్వయంగా రావడానికి అవకాశం లేనివారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చనని సూచించారు. అర్జీల పరిస్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
News December 14, 2025
మరికల్: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ వినీత్

నారాయణపేట జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత పోలింగ్ కేంద్రాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మరికల్ మండల కేంద్రంలో పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లోని 95 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదనపు ఎస్పీ రియాజ్ పోలీసులు ఉన్నారు.


