News February 1, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్‌లతో సీఈఓ వీడియో సమావేశం

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2025
జగ్గంపేట: మృతిచెందిన యువతి వివరాలు ఇవే..

ఏలూరు రోడ్డు ప్రమాదంలో జగ్గంపేటకు చెందిన మిట్టపర్తి భవాని (23) మృతి చెందింది. ఆమె స్వగ్రామం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కాట్రావులపల్లి వస్తుండగా గురువారం తెల్లవారు జామున ప్రమాదంలో మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
News March 7, 2025
సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.
News March 7, 2025
చందోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట గురువారం చందోలు పోలీసులను ఆశ్రయించింది. పిట్టలవానిపాలెం మండలం పరిసవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.