News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం అమ్మకాలు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
Similar News
News February 24, 2025
శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 5,035 మంది

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 5,035 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పురుషులు 3,416 మంది కాగా మహిళలు 1619 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సంబంధించి పీవో, ఏపీవోలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు.
News February 24, 2025
2028లో మేమే అధికారంలోకి వస్తాం: జగన్

AP: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కితీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
News February 24, 2025
కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని చెబుతుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ అని చెప్పుకునేందుకు బీఆర్ఎస్‌కు అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు.