News February 4, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ADB కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించగ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Similar News
News February 4, 2025
బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ
గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.
News February 4, 2025
ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్
విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.