News January 4, 2025

ఎర్రవల్లి: ప్రజలకు ఉత్తమ సేవలదించాలి: ఐజీ

image

కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 7, 2025

మహబూబ్‌నగర్: ప్రయోగ పరీక్షల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వచ్చేనెల జరిగే ప్రయోగ పరీక్షల నిర్వహణకు ప్రతి కళాశాలకు రూ.25 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో రసాయనాలు, పరికరాలను కొనుగోలు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.12 వేల చొప్పున కళాశాలకు కేటాయించారు. ప్రయోగ పరీక్షలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

News January 7, 2025

NRPT: స్కూల్‌కి వెళ్లమంటే ఉరేసుకున్నాడు

image

నారాయణపేట మండలం పెరపళ్లకి చెందిన <<15077017>>బాలుడు<<>> ఆంజనేయులు(15) ఉరేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బుగ్గమ్మ దంపతుల పెద్దకొడుకు ఆంజనేయులు 7వ తరగతి వరకు చదివి పొలం పనులు చేస్తూ, గొర్రెలు కాస్తున్నాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం శాసన్‌పల్లి శివారులో చెట్టుకు ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 7, 2025

పాలమూరులో 34,54,354 మంది ఓటర్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,43,276 మంది మహిళలు, 17,10.989 మంది పురుషులు ఉండగా ఇతరులు 89 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం 13,404 మంది ఓటర్లు పెరగటం గమనార్హం.