News December 26, 2024
ఎర్రోళ్ల అక్రమ అరెస్టు దుర్మార్గమైన చర్య: కేటీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని సిరిసిల్ల MLA, మాజీ మంత్రి KTR అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్‌తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.
News December 27, 2024
KNR: నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు. కాగా, నేటి పరీక్ష నిర్వహణ మళ్లీ ఎప్పుడు అనేది ప్రకటిస్తామన్నారు.
News December 27, 2024
కరీంనగర్ బస్టాండ్‌కు 44 ఏళ్లు పూర్తి
కరీంనగర్ బస్టాండ్ ఏర్పాటు చేసి నేటితో 44 ఏళ్లు పూర్తిచేసుకుంది. తెలంగాణలో HYD MG బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ KNR బస్టాండ్ కావడం విశేషం. 11 నవంబరు, 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు KNR బస్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. డిసెంబరు 27, 1980న అప్పటి భారత విదేశాంగ శాఖామంత్రి పీవీ నరసింహరావు ప్రారంభించారు. ఈ బస్టాండ్ పూర్తిచేయడానికి 4 ఏళ్లు పట్టింది. మొత్తం 44 ప్లాట్ ఫాంలు ఉన్నాయి.