News March 26, 2024

ఎలక్షన్ కోడ్.. ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్

image

ఏలూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చింతలపూడి మండలం కంచనగూడెం SGT మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చంచంరాజు టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఎస్.అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించరాదని ఆయన సూచించారు.

Similar News

News March 17, 2025

సబ్ కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ కార్యక్రమం

image

నరసాపురం సబ్ కలెక్టరేట్లో ఈనెల 17న తేదీన సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. సబ్ డివిజన్లోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుంచి అందించాలని కోరారు.

News March 16, 2025

ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.

News March 16, 2025

మొగల్తూరు: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

ప.గో జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొగల్తూరు SI నాగలక్ష్మి వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన జయరాజు(34) అత్యాచారం చేశాడు. ఈ ఘటన 11వ తేదీన జరగ్గా.. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసాపురం DSP శ్రీవేద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

error: Content is protected !!