News April 25, 2024
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాతవరం మండలం జిల్లేడుపూడి గ్రామానికి చెందిన సత్తిబాబు (35) మృతదేహం హైవేపై లభ్యమయ్యింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
విశాఖలో పౌష్టికాహార ముగింపోత్సవాలు

విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరినాలో పౌష్టికాహార ముగింపోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నపిల్లలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
News April 22, 2025
గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా

గోపాలపట్నంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళాలో 54 కంపెనీలు పాల్గొనున్నాయి. గోపాలపట్నం ఎస్.వి.ఎల్.ఎన్. జడ్పీ హై స్కూల్‌లో నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులు. ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. >Share it
News April 22, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ. 15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32, బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.15,గోరు చిక్కుడు రూ.32,పొటల్స్ రూ.30,కాప్సికం రూ.40,టమాటా రూ.16, క్యారట్ రూ.26/28,దొండకాయలు రూ.18, బీన్స్ రూ.48,కీర దోస రూ.20, చేమ దుంపలు రూ.32, మిర్చి రూ.24గా ఉన్నాయి.