News March 1, 2025
ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 1, 2025
ఖమ్మం జిల్లాలో పెండింగ్ LRS దరఖాస్తులపై సమీక్ష

మార్చి 31లోపు పెండింగ్ LRS దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు డా.పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఈరోజు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, భూ క్రమబద్ధీకరణలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 1, 2025
కేరళలో వరుస హత్యలు.. కారణమిదే!

కేరళలో ప్రేయసితో సహా నలుగురు కుటుంబ సభ్యులను <<15571171>>దారుణంగా హత్య<<>> చేసిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రూ.65 లక్షల అప్పు ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిందితుడు అఫాన్ భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేశానని పేర్కొన్నారు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అవుతుందని ఆమెను చంపినట్లు విచారణలో వెల్లడించారు.
News March 1, 2025
రెండు రోజులు సెలవులు

AP: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ శుభవార్త చెప్పారు. వారు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.