News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

Similar News

News March 15, 2025

పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

image

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్‌పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.

News March 15, 2025

‘కోర్టు’ సినిమాలోని ఈ అమ్మాయి ఎవరు?

image

నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కోర్టు’ మూవీలో ‘జాబిలి’ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ‘శ్రీదేవి అపళ్ల’. స్వస్థలం కాకినాడ. ఆమెను ఓ ఇన్‌స్టా రీల్‌లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ ఆమెను ఆడిషన్‌కు రిఫర్ చేశారు. అలా కోర్టు మూవీలో ఛాన్స్ వచ్చినట్లు శ్రీదేవి తెలిపారు.

News March 15, 2025

టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

image

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.

error: Content is protected !!