News January 24, 2025
ఎల్లారెడ్డిపేట: పెంచిన వారు వద్దు.. మొగుడే కావాలి

కనిపెంచిన తల్లిదండ్రులు వద్దని తాళి కట్టి పెళ్లి చేసుకున్న వాడే కావాలని అత్తగారింటికి వెళ్లిపోయిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కిష్ట నాయక్ తండాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా భవానిపేటకు చెందిన పుష్ప అనే యువతి భాను ప్రసాద్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నది. పోలీసుల కౌన్సెలింగ్లో తల్లిగారింటికి వెళ్ళింది. మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులు వద్దని అత్తగారి ఇంటికి వెళ్ళింది.
Similar News
News March 15, 2025
పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్‌పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.
News March 15, 2025
‘కోర్టు’ సినిమాలోని ఈ అమ్మాయి ఎవరు?

నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కోర్టు’ మూవీలో ‘జాబిలి’ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ‘శ్రీదేవి అపళ్ల’. స్వస్థలం కాకినాడ. ఆమెను ఓ ఇన్‌స్టా రీల్‌లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ ఆమెను ఆడిషన్‌కు రిఫర్ చేశారు. అలా కోర్టు మూవీలో ఛాన్స్ వచ్చినట్లు శ్రీదేవి తెలిపారు.
News March 15, 2025
టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.