News January 27, 2025
ఎల్లారెడ్డిపేటలో వీడని మూఢనమ్మకాలు

ఎల్లారెడ్డిపేట మండలంలోని కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. ఆదివారం, గురువారం వస్తే చాలు ఉడకబెట్టిన కోడిగుడ్లు, పసుపుతో చేసిన అన్నం, జీడిగింజలు, నిమ్మకాయ, పచ్చని ఇస్తరాకులు ఏర్పాటుచేసి చౌరస్తాల్లో పెడుతున్నారు. ఉదయాన్నే లేచిన ప్రజలు దారి వెంట వెళ్తుండగా వీటిని చూసి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి కొంతమంది వాటిని చూసి రోడ్ల పైన పెట్టిన వారిని దూషిస్తున్నారు.
Similar News
News March 14, 2025
బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
News March 14, 2025
కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు.
News March 14, 2025
ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.