News March 6, 2025

ఎస్.రాయవరం: యువకుల ప్రాణం తీసిన అతివేగం..!

image

రైల్వే న్యూకాలనీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి గోపి కుమారుడు యశ్వంత్(21), గొడుగు అచ్చిరాజు కొడుకు సాయికుమార్(20) <<15656341>>మృతి చెందారు<<>>. యశ్వంత్ కుటుంబం బతుకుతెరువు కోసం ఎస్.రాయవరం నుంచి నగరానికి వలస వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 120 స్పీడ్‌లో నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News

News March 6, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

image

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని మెదక్ జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.

News March 6, 2025

సుప్రీం కోర్టుకు చేరిన TN హిందీ పంచాయితీ

image

TN, కేరళ, బెంగాల్‌లో జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం అవి NEP అమలు చేయాలని, ఇందుకు MOU కుదుర్చుకున్నాయని పిటిషన్ వేసిన అడ్వకేట్ మణి అన్నారు. దీనిపై TN CM స్టాలిన్ వ్యతిరేకత అవాస్తవం, రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. పాలసీ అమలుపై రాష్ట్రాలను ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు లేనప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కలగజేసుకోవచ్చన్నారు.

News March 6, 2025

సిద్దిపేట్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

image

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని సిద్దిపేట జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.

error: Content is protected !!