News November 7, 2024
ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే పై అధికారులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి సమీక్ష
ఎస్టీల అభ్యున్నతికి ప్రతి ఒక్క అధికారి తమ వంతు బాధ్యత వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బుధవారం రాత్రి ఆయన ఈనెల 8వ తేదీ వెంకటాచలం మండలం చెముడుగుంటలో నిర్వహించనున్న ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో అనూష తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2024
నెల్లూరు: పదో తరగతి ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
పదో తరగతి ఫీజు చెల్లింపునకు గడువును ఈనెల 18 వరకు పొడిగిస్తున్నట్లు నెల్లూరు DEO R.బాలాజీ రావు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25 వరకు, రూ.200 ఫైన్‌తో వచ్చే నెల 03 వరకు, రూ.500 ఫైన్‌తో 10 వరకు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులకు రూ.110, ఆపై సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు.
News November 6, 2024
శరవేగంగా కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లు
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల సహకారంతో జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 8, 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలోని VRC మైదానంలో లక్ష దీపోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష దీపోత్సవం కోసం ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు.
News November 6, 2024
నెల్లూరు: పదో తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి
నెల్లూరు రూరల్ మండలం ధనలక్ష్మిపురంలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ముత్తుకూరు RR కాలనీకి చెందిన దువ్వూరు ప్రణీత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.