News February 13, 2025

ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్‌నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.

Similar News

News February 14, 2025

మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

image

నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.

News February 13, 2025

MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

News February 13, 2025

మెదక్: లేగ దూడపై చిరుత దాడి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.

error: Content is protected !!