News March 20, 2025

ఎస్సారెస్పీ స్టేజ్-2కు రూ.34.01 కోట్లు కేటాయింపు

image

సూర్యాపేట జిల్లాలోని SRSP స్టేజ్-2 కింద కొనసాగుతున్న పనులకు రూ.34.01 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. తూములు, షట్టర్లు, లైనింగ్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో వందకు పైగా కిలోమీటర్ల మేరకు ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు లైనింగ్ లేకపోవడంతో నీటిని విడుదల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.50కోట్లు కేటాయించడంతో చివరి ఆయకట్టుకు సైతం నీరందనుంది.

Similar News

News March 21, 2025

IPL అభిమానులకు గుడ్ న్యూస్

image

IPL ప్రేమికులకు BCCI శుభవార్త చెప్పింది. దేశంలోని 50 నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. స్టేడియంను తలపించేలా లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్, మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్‌మెంట్, కిడ్స్ ప్లే జోన్, ప్లే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్ (APR 5,6 తేదీల్లో), విజయవాడ (MAY 10,11), వరంగల్ (MAY 17, 18), కాకినాడ (MAY 23, 25)లో ఏర్పాటు కానున్నాయి.

News March 21, 2025

వచ్చే నెల 3న క్యాబినెట్ భేటీ

image

AP: వచ్చే నెల 3న సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక విషయాలపై మంత్రిమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి పనులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News March 21, 2025

బ్రాహ్మణుడు లేని ఆదర్శ వివాహాలు జరగాలి: యాదగిరి

image

సమాజంలో ఆదర్శ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు మరిన్ని జరగాలని పాశం యాదగిరి, పలవురు వక్తలు అభిప్రాయపడ్డారు. SVKలో నాగర్‌కర్నూల్‌కు చెందిన వెంకటేశ్ (ఎస్సీ) మంచిర్యాలకు చెందిన హారిక (ఎస్టీ) ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షతన బ్రాహ్మణుడు, మంత్రాలులేని ఆదర్శ వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట పాడి అలరించారు.

error: Content is protected !!