News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషి చేస్తా: AICC సెక్రెటరీ
AICC సెక్రెటరీ సంపత్ కుమార్‌ను మంద కృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించాలని సంపత్‌ని కోరారు. చేవెళ్ల డిక్లేరేషన్, అసెంబ్లీలో CM రేవంత్ చేసిన ప్రకటనకు అనుగుణంగా వర్గీకరణను త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలన్నారు. వేల గొంతులు-లక్షల డప్పుల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వర్గీకరణ పూర్తవడానికి తన వంతు కృషి చేస్తానని సంపత్ హామీ ఇచ్చారని కృష్ణ తెలిపారు.
Similar News
News January 9, 2025
HYD: పొగ మంచులో డ్రైవ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి!
✓పొగమంచులో వేగం తగ్గించి వాహనం నడపండి
✓హై బీమ్ బదులు,లో బీమ్ హెడ్ లైట్ వాడండి
✓కార్లలో ఏసీ ఆన్ చేసి ఉంచుకోండి
✓ఓవర్ టేక్ చేయడం బంద్ చేయండి
✓జంక్షన్లు, టర్నింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
✓సైకిలిస్టులు, పాదచారులను గమనించండి
✓పొగమంచు అధికంగా ఉన్నప్పుడు ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది
✓పొగమంచులో డ్రైవింగ్ చేసినప్పుడు ఈ సూచనలు పాటించాలని రాచకొండ పోలీసులన్నారు.
News January 9, 2025
శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
మాదాపూర్‌లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
News January 9, 2025
GHMC: జనవరి 31 లాస్ట్ డేట్, తర్వాత చర్యలే!
గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.