News August 1, 2024

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు గారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 29, 2024

నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ 

image

వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

News November 29, 2024

ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా

image

ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.

News November 29, 2024

చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.