News August 29, 2024
ఏం చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
CM రేవంత్‌రెడ్డి గురుకులాల్లో మౌలిక వసతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. మీ పాలన ఎలా ఉందొ చెప్పడానికి గురుకులాలే నిదర్శనం. KCR హయాంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయి’అని X వేదికగా ఫైర్ అయ్యారు. విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు.
Similar News
News November 17, 2024
గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది..?: రఘునందన్ రావు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఐపీ, ఓపి విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా..? అని X వేదికగా ఎంపీ నిలదీశారు.
News November 17, 2024
మెదక్: రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఎన్నిక
మెదక్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కానుగు రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం మెదక్ లో ఎన్నికలు నిర్వహించారు. జనరల్ సెక్రెటరీగా విద్యాసాగర్, ట్రెజరర్‌గా రాజు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌గా జాయింట్ సెక్రటరీలుగా బి. కిషన్, పి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అస్లాం ఖాన్, పోచయ్య, గౌరవాధ్యక్షుడిగా పి. శెట్టయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, యాదగిరి, అనిల్ ఎన్నికయ్యారు.
News November 17, 2024
ఝరాసంగం: పాము కాటుతో విద్యార్థి మృతి
పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఝరాసంగం మండల మంచునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. ధనసిరి బాబు, మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద పత్తి చేనులో పాము కాటుకు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.