News March 20, 2024
ఏఎస్ పేట మండలంలో వాలంటీర్‌పై వేటు
ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Similar News
News February 4, 2025
రూ.40 కోట్లు పలికిన నెల్లూరు జాతి ఆవు
బ్రెజిల్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.40 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఆవును ఒంగోలు జాతి ఆవు అని కూడా పిలుస్తారు.
News February 4, 2025
నెల్లూరు:ల్యాబ్ టెక్నీషియన్ల సమీక్షా సమావేశం
అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
News February 4, 2025
నెల్లూరు రానున్న ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్
రెండు రోజులు నెల్లూరు జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 4వ తేదీన జిల్లాలోని కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో క్షేత్ర పరిశీలన అనంతరం రాత్రికి నెల్లూరులోనే బస చేస్తారు. 5వ తేదీ నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో 11 గంటల వరకు క్షేత్ర పరిశీలన జరగనున్నట్లు షెడ్యూల్లో తెలిపారు.