News March 24, 2025
ఏటూరునాగారం: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.
Similar News
News March 29, 2025
విశాఖలో ప్రేమ పేరుతో మోసం

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.
News March 29, 2025
గుంటూరు మిర్చి యార్డుకు సరుకు తీసుకు రావద్దు

గుంటూరు మిర్చి యార్డుకు రైతులు ఎవరూ సరుకు తీసుకు రావద్దని యార్డు అధికారులు శుక్రవారం తెలిపారు. యార్డుకు మూడు రోజులు సెలవులు ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు, ఆదివారం యార్డుకు వీక్ ఎండ్ సెలవులు ఇవ్వగా.. సోమవారం రంజాన్ సందర్భంగా సెలవు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మిర్చి యార్డ్‌కు బస్తాలు తీసుకురావద్దని అన్నారు. తిరిగి మరలా యార్డును మంగళవారం నుంచి కొనసాగిస్తామని చెప్పారు.
News March 29, 2025
బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.