News February 25, 2025
ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.. స్పందించిన హోం మంత్రి

అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడాం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని, గుండాల కోనకు వెళ్లే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలి’ అని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 25, 2025
10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా.. ‘ఢిల్లీ’ ఓ ఉదాహరణ

APలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం హాట్‌టాపిక్‌గా మారింది. YCPకి 10% సీట్లు(18) లేనందున తాము ఆ హోదా కల్పించబోమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వొచ్చని ‘ఢిల్లీ’ని ఉదాహరణగా వైసీపీ చూపిస్తోంది. 2015లో 70 సీట్లకుగాను ఆప్ 67 స్థానాలు, బీజేపీ 3 చోట్ల గెలిచింది. 10% సీట్లు(7) లేకపోయినా స్పీకర్ రామ్ నివాస్ BJP నేత విజేందర్ గుప్తాను ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
News February 25, 2025
వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు అవమానం: గంటా

గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టి అవమానించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిపించాలన్నారు. పదవిని కాపాడుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారని, తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
News February 25, 2025
తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.