News October 10, 2024

ఏపీ ప్రజలతోనూ రతన్ టాటాకు అనుబంధం: మంత్రి పయ్యావుల

image

ఏపీ ప్రజలతో దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు మంచి అనుబంధం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో మంత్రివర్గం టాటాకు నివాళులు అర్పించింది. ఉప్పు నుంచి ఉక్కు దాకా టాటా గ్రూప్ అనేక సంస్థలను స్థాపించిందని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిదని గుర్తు చేసుకున్నారు. టాటా సంస్థలు ఇప్పటికీ ఏపీ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.

Similar News

News December 30, 2024

శ్రీ సత్యసాయి జిల్లా నేర గణాంకాల వార్షిక నివేదిక విడుదల

image

శ్రీ సత్య సాయి జిల్లా నేర గణాంకాల వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ రత్న విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులతో కలిసి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంలో జిల్లాలో నమోదైన వివిధ కేసుల గణాంకాలు, బాధితులకు చేసిన సత్వర పరిష్కారం, పోలీస్ శాఖ పనితీరుపై వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.

News December 30, 2024

గుండెపోటుతో అనంతపురం వైసీపీ నేత మృతి

image

అనంతపురం జిల్లా పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. విఠల్ మృతిపై వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రవీణ్ సాయి విఠల్ మృతి చాలా బాధాకరమని వైసీపీ ట్వీట్ చేసింది. అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది.

News December 30, 2024

కాపు రామచంద్రారెడ్డి పార్టీ మారనున్నారా?

image

అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చినా తనకు అంత ప్రాధాన్యం లేదని భావిస్తున్న ఆయన తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నెట్టింట జోరు ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఆయన అనుచరులు ఖండిస్తున్నారు.