News January 16, 2025

ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!

image

ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 20మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆదోని MLA పార్థసారథి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ నెల 19న విజయవాడలో నిర్వహించే సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News January 16, 2025

ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.

News January 16, 2025

కర్నూలు జిల్లాలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!

image

కర్నూలు జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కర్నూలులో కాంపోజిట్ ఫెసిలిటీపై రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే సుమారు 6వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

News January 16, 2025

డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని

image

YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.