News July 2, 2024

ఏపీ సమగ్రాభివృద్ధికి సహకరించండి: MP

image

ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఎంపీ కలిశారు. రాష్ట్రంలోని సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పరిశ్రమల స్థాపన, ఆత్మనిర్భర్ పథకాల అమలుకు సహకారం అందించాలని కోరారు.

Similar News

News September 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

News September 19, 2024

తిరుపతి జిల్లాలో 27 మంది పోలీస్ కానిస్టేబుళ్లు బదిలీ

image

తిరుపతి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లనో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News September 19, 2024

చిత్తూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?

image

చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగతా సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్