News April 5, 2025

ఏపీలో ఒకే ఒక్కడు.. అది మన కడపోడే

image

కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన నాగరాజు అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లను ప్రకటించింది. అందులో 31 టీడీపీ, 6 జనసేన, బీజేపీకి ఒకటి కేటాయించింది. ఇందులో బీజేపీ తరఫున యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా రామిరెడ్డికి ఈ అవకాశం లభించింది. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.

Similar News

News April 6, 2025

కన్నులపండువగా కోదండ రాముని ధ్వజారోహణం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి రోజు ధ్వజారోహణం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.

News April 6, 2025

కడప జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

image

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు, బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News April 6, 2025

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

image

రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉదయం 9-30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.

error: Content is protected !!