News March 27, 2025
ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News April 1, 2025
సన్న బియ్యం పథకం చారిత్రాత్మకం: ఎమ్మెల్యే సామేలు

సన్న బియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
News April 1, 2025
బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొండముది

బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అద్దంకికి చెందిన కొండముది బంగారుబాబు ఎన్నికయ్యారు. మంగళవారం బాపట్ల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో బంగారు బాబు పేరును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు బీజేపీ ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. సీనియర్ల సూచనల మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ బాపట్ల జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తానని తెలిపారు.
News April 1, 2025
ప్రకాశం: పింఛన్ నగదు మాయం

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్‌లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.