News December 8, 2024

ఏయూకి పూర్వవైభవం తీసుకురావడానికి సహకరించాలి: లోకేశ్

image

ఏయూకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్నీ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఏయూని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు.

Similar News

News December 27, 2024

కుల‌గ‌ణ‌న‌పై స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే: విశాఖ జేసీ

image

జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల‌పై సమీక్ష చేసేందుకు, ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వ‌హించిన కులగ‌ణ‌న‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే(సోష‌ల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.

News December 26, 2024

విశాఖ: కూటమిలో ఆడారి ఇముడుతారా?

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News December 26, 2024

గోల్డ్ అవార్డు గెలుచుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు గెలుచుకుంది. అవార్డును విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున ఇంధన, పర్యావరణం జనరల్ మేనేజర్ ఉత్తమ బ్రహ్మ, డీజిఎం విజయానంద్ గురువారం విజయవాడలో స్వీకరించారు. స్టీల్ ప్లాంట్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సాధించినందుకు ప్లాంట్ సీఎండీ ఏకె సక్సేనా అధికారులు సిబ్బందిని అభినందించారు.