News November 15, 2024
ఏలూరు: ఎస్పీ కార్యాలయంలో దివాస్ కార్యక్రమం
ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.
Similar News
News November 15, 2024
తుఫాన్ల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు: ప.గో కలెక్టర్
ప.గో.జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మూడుసార్లు తుఫాన్‌లు వచ్చాయని.. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారులు సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువలు ద్వారా 4,03,001 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు.
News November 15, 2024
ప.గో: నేడు జిల్లాలో మోస్తరు వర్షాలు
అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉమ్మడి ప.గో. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వరి కోతలు ముగించుకొని రోడ్లపై ధాన్యాం రాశులను రైతులను ఆరబెడుతున్నారు.
పంట చేతికి వచ్చే సమయం కావడంతో వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు భయాందోళన చెందుతున్నారు.
News November 15, 2024
ఏలూరు: భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష
ఏలూరు జిల్లాలో భూసేకరణ పనులను సంబంధిత ఆర్డీవోలు ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్లతో సమీక్షించి వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఫిషింగ్ ఔట్లెట్స్ ఏర్పాటు భూసేకరణ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి కోర్టులలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.