News October 22, 2024

ఏలూరు జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి నాదెండ్ల

image

జనసేన పార్టీ PAC ఛైర్మన్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తొలిసారిగా జిల్లాకి విచ్చేశారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గం ఇంఛార్జి గంటసాల వెంకటలక్ష్మి ఘనస్వాగతం పలికారు. దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు మోర్ నాగరాజు, జిజ్జువరపు సురేశ్, మేడిచర్ల కృష్ణ, ముత్యాల రాజేష్, తాతపూడి చందు, జనసైనికులు ఘనస్వాగతం పలికారు.

Similar News

News October 22, 2024

ఏలూరు జిల్లాలో మృతదేహాల దొంగతనం UPDATE

image

ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీలో గత నెల 8న అర్ధరాత్రి మార్చురీలో మృతదేహాన్ని దొంగిలించి తరలిస్తూ.. సిబ్బంది పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మార్చురీ అసిస్టెంట్ అశోక్‌ను విధులనుంచి తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇలా ఎన్ని శవాలను, ఏఏ కళాశాలకు తరలించారనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరందరూ ఒక ముఠాగా మారి దందా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

News October 21, 2024

అధిక వర్షాల నేపథ్యంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల ప్రకారం 24, 25, 26 తేదీల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

News October 21, 2024

ఏలూరు: కరెంట్ షాక్ తగిలి యువకుడి మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం విషాద ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడేనికి చెందిన కవులూరి చరణ్(20) గురవాయిగూడెంలో కర్ర కోత మిషన్ పనికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ షాక్ తగిలి మృతిచెందాడు. కోత మిషన్ యజమాని మేకల గంగాధర్ తిలక్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.