News March 22, 2025

ఏలూరు జిల్లాలో 155.29 కి.మీ రోడ్డులు పూర్తి: కలెక్టర్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 850 గోకుల షెడ్డులు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తిగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధేశించిందన్నారు. పంచాయితీరాజ్ ద్వారా ఇంతవరకు 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డుల నిర్మాణం పూర్తిచేశారన్నారు.

Similar News

News March 22, 2025

క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండండి: బాపట్ల ఎస్పీ

image

యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని క్రికెట్ బెట్టింగులకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. యువత బెట్టింగుల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సాధించాలని అన్నారు.

News March 22, 2025

మెదక్: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

image

ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో రాధా కిషన్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన టీచర్లకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం ఉంటుందని పేర్కొన్నారు. మూల్యాంకనం విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని డీఈవో సూచించారు.

News March 22, 2025

ఎంఎంటీఎస్ కోసం వేయికళ్లతో ఎదురుచూపు..!

image

వికారాబాద్ జిల్లా ప్రజలు MMTS రైలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజు జిల్లా నుంచి సుమారుగా 10 – 12 వేల మంది ప్రయాణికులు HYDకు వెళ్లి వస్తున్నారు. కొన్నేళ్లుగా VKB రైల్వే స్టేషన్ జంక్షన్‌గా కొనసాగుతుంది. కాగా MMTS సర్వీస్ ప్రస్తుతం లింగంపల్లి వరకే ఉంది. కావున MMTS సర్వీస్‌ను VKB వరకు పొడిగిస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో మేలవుతుంది. ప్రభుత్వం ఇందుకు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

error: Content is protected !!