News March 17, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

*జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం* జిల్లాలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం * మద్ది ఆంజనేయుని, గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్న హీరో నితిన్ * జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 2,115 మంది విద్యార్థులు గైర్హాజరు* రాష్ట్రపతి భవన్ లో విందులో పాల్గొన్న ఏలూరు ఎంపీ* కారుణ్య నియామక పత్రాలను అందజేసిన ఎస్పీ* భీమడోలు సమీపంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
Similar News
News March 18, 2025
హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్

TG: హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.
News March 18, 2025
ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 18, 2025
మేడిపల్లి : త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఉమ్మడి మేడిపల్లి మండలంలోని రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. MDP రైల్వే స్టేషన్లో కొందరు దుండగులు ప్లాట్‌ఫారంపై గల సిమెంట్ బెంచిని రైల్వే ట్రాక్ పై పడేశారు. దీనిని ఉదయం సమయంలో గమనించిన స్థానికులు ఆబెంచిని ట్రాక్ పై నుంచి తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు ఇలాంటివి జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.