News March 21, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

*గుంటుపల్లి కేసులో నలుగురికి జీవిత ఖైదు* జిల్లాలో కొన్ని చోట్ల మెడికల్ షాపులపై దాడులు* చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కరించిన ఎంపీ మహేశ్* నూజివీడులో గంగానమ్మ విగ్రహం తొలగింపు పై భక్తుల ఆందోళన* 83 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి* డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్* ఏలూరు జిల్లాలో 155.29 కిలోమీటర్ల రోడ్లు పూర్తి: కలెక్టర్ వెల్లడి

Similar News

News March 22, 2025

డీలిమిటేషన్‌తో ఉత్తరాది డామినేషన్: కేటీఆర్

image

TG: డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

News March 22, 2025

మదనపల్లెలో మైనర్ బాలికకు పెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు

image

మదనపల్లె మండలంలో మైనర్ బాలికకు పెళ్లి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు వారం క్రితం తండ్రికి తెలియకుండా తల్లి పెళ్లి చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు బాలిక తల్లికి ఫోన్ చేసి స్టేషక్‌కు రావాలన్నారు.

error: Content is protected !!