News November 11, 2024
ఏలూరు జిల్లాలో మహిళల కోసం అభయ దళం
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలో మహిళల కోసం నూతనంగా అభయ దళం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల కోసం 95503 51100 టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112కు సమాచారం అందించిన 10 నిమిషాల్లో పోలీసులు మీకు భద్రతను కల్పిస్తూ, మహిళలపై వేధింపులు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 22, 2024
కేంద్రమంత్రి తండ్రి మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి
నర్సాపురం ఎంపీ, కేంద్రసహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. సూర్యనారాయణ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 22, 2024
ప.గో: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి.. వివరాలివే
పశ్చిమగోదావరి జిల్లాలో 3 మండలాల్లో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. దేవరపల్లి మండలం యాదవోలు శివారులో యాదాల దిలీప్(30), నల్లజర్ల మండలం అయ్యవరంలో వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం మండలం కె.సావరంలో నాగేంద్ర మృతి చెందారు. దీంతో ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
News November 22, 2024
ప.గో: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఐదుగురే.!
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు చివరకు ఐదుగురే మిగిలారు. ఉపఎన్నికల్లో ఒక నామినేషన్ ఉపసంహరణ అనంతరం ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గురువారం తెలిపారు. 1.గంధం నారాయణరావు, 2.దీపక్ పులుగు, 3.నాగేశ్వరరావు కవల, 4.నామన వెంకట లక్ష్మీ, 5.బొర్రా గోపీ మూర్తి అభ్యర్థులు బరిలో నిలిచినట్లు చెప్పారు. 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.