News March 20, 2025
ఏలూరు: తాగునీటి సమస్య తలెత్తితే చర్యలు

ఈ వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారం రోజులలో కార్యచరణ తీసుకోవాలన్నారు.
Similar News
News March 29, 2025
దుగ్గొండి: ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవళిక(27) శుక్రవారం ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ప్రవళికకు భర్త సుధాకర్, ఇద్దరు పిల్లలున్నారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 29, 2025
గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.
News March 29, 2025
గద్వాల: జమ్ములమ్మ ఆలయ ఆదాయం రూ. 27,78,778

గద్వాల మండల పరిధిలోని జమ్మిచెడు జమ్మలమ్మ ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి పురేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఆలయ సిబ్బంది సమక్షంలో లెక్కింపు కార్యక్రమంలో చేశామని అన్నారు. ఆలయంలో 65 రోజులకు గాను మొత్తం రూ. 27,78,778/- ఆదాయము వచ్చిందన్నారు. నోట్ల ద్వారా రూ.25,45,700/- ఆదాయం రాగా, నాణేల రూపంలో రూ.2,33,078/- ఆదాయం వచ్చిందన్నారు.