News November 9, 2024

ఏలూరు: దీపం-2 పథకంపై అధికారులతో జేసీ సమీక్ష

image

ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీ యాజమాన్యాలు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 6,31,044 మంది బియ్యం కార్డుదారులలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈకెవైసి పూర్తైన తరువాత మాత్రమే అర్హులన్నారు.

Similar News

News November 27, 2024

ఉండి యువతికి కీలక ఉద్యోగం

image

దేశస్థాయిలో ప.గో జిల్లా యువతి సత్తా చాటారు. ఉండి పెదపేటకు చెందిన నిస్సీ ప్లోరా డిగ్రీ BSC చదివారు. తర్వాత ఆమె హార్టికల్చర్ విభాగంలో పీహెచ్‌డీ చేశారు. దేశంలోని 16 కీలక పోస్టులకు 16 వేల మంది పరీక్షలు రాశారు. ఈక్రమంలో నిస్సీ ఫ్లోరా ప్రతిభ చూపి అహ్మదాబాద్‌లోని నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. నిస్సీ తండ్రి ఏసురత్నం రిటైర్డ్ టీచర్. తల్లి వర్జీనియా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.

News November 27, 2024

భీమవరం నుంచి మలేషియా పంపి మోసం

image

మలేషియా పంపి మోసం చేసిన ఘటన భీమవరంలో జరిగింది. ‘నేను భీమవరంలోని మోటుపల్లివారి వీధిలో ఉంటున్నా. ప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని పంబ్లింగ్ పని కోసం నన్ను మలేషియా పంపింది. కానీ ఓ హోటల్లో పనికి పెట్టి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. తిరిగి భీమవరం పంపాలని నా భార్య ఆ మహిళను కోరినా పట్టించుకోలేదు. తెలిసిన వాళ్ల ద్వారా భీమవరం వచ్చా’ అని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2024

ఆకివీడులో 40 అడుగుల బొప్పాయి చెట్టు

image

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగరపంచాయతీలో కాకరపర్తి వీధిలో సత్యనారాయణ పెరటిలో బొప్పాయి చెట్టు అబ్బుర పరుస్తుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ బొప్పాయి సాధారణంగా ఐదు నుంచి పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి అన్నారు. తన పెరటిలో నాటిన మొక్క సుమారు 40 అడుగులు వరకు పెరిగి అందరిని ఆశ్చర్య పరుస్తుంది అన్నారు. తాను ఐదు సంవత్సరాల క్రితం నాటినట్టు ఆయన తెలిపారు.