News April 4, 2025
ఏలూరు: నకిలీ పోలీసులు అరెస్టు

సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పుకుంటూ భీమడోలు పరిసర ప్రాంతాలలో దుకాణదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మీడియాకు వివరాలు తెలిపారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కేసుని ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్‌లను అభినందించారు.
Similar News
News April 8, 2025
పా.గో: పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్ కు 18 అర్జీలు- ఎస్పీ

పా.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌కు 18 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
News April 7, 2025
పెదతాడేపల్లి గురుకులానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు స్కౌట్స్, గైడ్స్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఈ రికార్డు సాధించినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ ఆదివారం WAY2NEWS ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
News April 6, 2025
7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.