News March 19, 2025
ఏలూరు: పలు విద్యాసంస్థల బస్సులపై 8 కేసులు నమోదు

ఏలూరు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఆదేశాల మేరకు బుధవారం ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల బస్సులను మోటారు వాహనాల తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా తదితర వాటిని పరిశీలించి, 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ కరీమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనాల తనిఖీ అధికారులు ఎస్.బి.శేఖర్, వై.సురేశ్ బాబు, వై.ఎస్.వై.కళ్యాణి పాల్గొన్నారు.
Similar News
News March 20, 2025
అమలాపురం కుర్రాడికి గేట్‌లో 10వ ర్యాంక్

అమలాపురం మండలం బండారులంకక చెందిన చేనేత కార్మికుని కుమారుడు పిచ్చుక కుమార్ వాసు గేట్ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియాలో పదవ ర్యాంకు సాధించాడు. బండారులంక గ్రామానికి పేరు తీసుకొచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, రేణుక వాణి దంపతులను పలువురు సత్కరించారు.
News March 20, 2025
తూ.గో : ఈ మండలాల ప్రజలకు హెచ్చరిక

తూ.గో జిల్లాలో నేడు ఎండలు విపరీతంగా ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జిల్లాలోని గోకవరం, కొవ్వూరు, పెరవలి, రాజమండ్రి, రాజానగరం మండలాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 20, 2025
నిర్మల్: ఆ గురువులే కీచకులు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.