News July 1, 2024
ఏలూరు: పింఛన్ నిరాకరించిన మహిళ
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పింఛన్ల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాగా గ్రామానికి చెందిన సూర్యదేవర పద్మావతి అనే మహిళకు కూటమి నాయకులు రూ.7వేల పింఛన్ అందించారు. కాగా ఆమె తీసుకున్న పింఛన్‌కు రూ.3 వేలు కలిపి మొత్తం రూ.10వేలను తిరిగి కూటమి నాయకులకు ఇచ్చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సాయంగా ఈ నగదు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.
Similar News
News November 27, 2024
ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ
తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.
News November 27, 2024
ఓం బిర్లాను కలిసిన RRR
దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు.
News November 27, 2024
నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR
ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.